విండోస్ 10 విశేషాలు


మైక్రోసాఫ్ట్ విండోస్ 8.1 తర్వాత వెర్షన్ విండోస్ 9 అవుతుందని అందరూ అనుకున్నారు.  అయితే మైక్రోసాఫ్ట్ విండోస్ 10 వెర్షన్‌ని ప్రకటించి అందరికీ ఆశ్చర్య చకితులను చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ త్వరలో అందరికీ అందుబాటులోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో విండోస్ 10 ప్రివ్యూను మైక్రోసాఫ్ట్ సంస్థ బుధవారం నాడు ప్రకటించింది. ఈ విండోస్ 10 విశేషాలు ఇలా వున్నాయి.

*  విండోస్ 10 అన్ని డివైస్‌లకు ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడుతుంది.

* విండోస్ 10 కోసం రూపొందించిన యాప్స్ డెస్క్‌టాప్, ఫోన్, ఎక్స్‌బాక్స్ ఇలా అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల పైనా పనిచేస్తాయి.

* విండోస్ 8 వర్షన్‌లో కోల్పొయిన స్మార్ట్ మెనూను విండోస్ 10 వర్షన్‌లో మైక్రోసాఫ్ట్ తిరిగి ప్రవేశపెట్టింది.

* విండోస్ 10లో స్పార్టాన్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. తక్కువ స్పేస్‌‌ను మాత్రమే ఆక్రమించే స్పార్టాన్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ తరహాలో వేగవంతంగా స్పందించగలదు.
 
* విండోస్ 10 ఓఎస్ మొబైల్ వర్షన్ ఫిబ్రవరి నుంచి అందుబాటులో వుండనుంది.

* విండోస్ 10 అన్ని ఫోన్‌లలోనూ ఒక సంవత్సరం పాటు ఉచితంగా రన్ అవుతుంది.

* విండోస్ 10లోని కార్టోనా కార్టోనా వాయిస్ అసెస్టెంట్ ఫీచర్‌ మనం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంది.

* స్పార్టాన్ స్పార్టాన్ బ్రౌజర్‌వేగవంతమైన బ్రౌజింగ్‌ను చేయగలదు.

* ఎక్స్‌బాక్స్ గేమింగ్ డివైస్‌‌ను సునాయాసంగా తమ డివైస్‌లలో రన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన యాప్‌‌ ఇందులో వుంది.