మనోధైర్యానికి మించిన మందు లేదు...

మనం శారీరకంగా  బలంగా ఉంటె సరిపోదు మానసికంగా బలంగా ఉన్నప్పుడే దేనిని అయినా ఎదుర్కోగలం ఇది అందరు మానసిక నిపుణులు చెప్పేదే 
 మానసిక సంహర్షణకు గురి అవ్వడం మనవ సహజ లక్షణం సంఘర్షణలో వాస్తవాలు తెలుసుకోక పోవడం ఒకటి అయితే అన్నిటికీ భయపడడం ఎదో అయిపోయింది అన్న భయం అందరిని వెంటాడుతోంది. అంతా భయం గుప్పెట్లో బిక్కుబిక్కు మంటూ భయం భయం గా బతుకు తున్నాడు సామాన్యుడు.కాస్త దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, కొంచం ఒంట్లో వేడిగా ఉన్న ఆక్సి పల్స్ మీటర్ తో ఆక్సిజన్ తగ్గ గానే  అమ్మో కుయ్యో మొర్రో అంటూ  ఆసుపత్రికి వెళతామని ఇంట్లో ట్రీట్మెంట్ వద్దని అంటున్నారు మీకు పోసిటివ్ అనగానే,లేదా సిటి స్కాన్ లో ఇన్ఫెక్షన్ అనగానే భయానికి గురిఅవుతున్నారు సామాన్యజనం అలాగే చుట్టూ అదేపనిగా కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్ కూతలు మరోవైపు రాత్రివేళ పోలీస్ సైరెన్ మోతలు వెరసి సామాన్యుడిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దగ్గర బంధువులు పోయరన్న వార్త దీనిమూలంగా పోయారని చెప్పగానే తీవ్ర మానోవేదనకు గురికావడం చ్చూస్తున్నాం.ముఖ్యంగా అయిన వాళ్ళందరికీ దూరంగా ఎక్కడో పట్టణంలో హాస్టల్ లో  ఉంటున్న   యువత తీవ్ర మనోవేదనకు  గురి అవుతున్నారని మానసిక  వైద్యులు వివరించారు.

ముఖ్యంగా ఒంటరిగా ఉన్నామన్న ఆందోళన తోనే  యువత తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఊరు పోదామంటే అక్కడ కరోనా ఇక్కడ ఒంటరి తనం నాకే కరోనా వస్తే దిక్కెవరు అన్న ప్రశ్న వారిని వేదిస్తోంది. మొత్తంగా తన చుట్టూ ఉన్నవాళ్ళకి కరోనా ఉందేమో అన్న భయం యువతను వేదిస్తోంది ఈసమస్యకు పరిష్కారం దొరకక కొట్టు మిత్తడుతున్న యువత నిరాశా నిస్పృహలకు గురిఅవుతున్నారు. ఇంకొందరు తనకు కరోనా వచ్చిందని  ట్రీట్ మెంట్ కి రూపాయిలేదని అందరినీ ఇబ్బంది పెట్టేబదులు తానే తనువు చాలిద్దామని రైలుకింద తల పెడదామని వెళ్ళాడు అక్కడ తనని అదృష్టం వెక్కిరించిందిఅలా ఒక్కసారి ఫెయిల్ అయినా మల్లె మళ్ళీ ప్రయత్నం చేసే స్వభావం వాళ్ళది వాళ్ళని ఇంట్లో వాళ్ళే  కనిపెట్టి గమనించాలి లేదా నూరేళ్ళ జీవితాన్ని ముగిస్తే పడే మానసిక వేదన తల్లి తండ్రుల కడుపుకోత కు గురిచేయడమే అంటున్నారు నిపుణులు.

ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కో వేదన ఇక నగరాలలో  ఇంకోసమస్య చిన్న చిన్న కంపె నీలలో చేసే ఉద్యోగుల  పరిస్థితి మరీ దయనీయం ముఖ్యంగా ఈ ఒక్క ఉద్యోగం పోతే బతుకుబండిని ఈడ్చేది ఎలా అనుకుంటూ పరుగుపరుగున బస్సులోపడి పోతున్నాడు సగటు కార్మికుడు అక్కడ బస్సులో రద్దీ గా ఉండడం తో తప్పక ఎక్కాల్సిన పరిస్థితి బస్సులో ఎవరికైనా కోరోనా ఉంటె  అమ్మో అటు రాక ఇటు ఇంటికిపోక బస్సులోనే అయినా తప్పని బతుకుపోరాటం. కుటుంబాన్ని నెట్టుకు రావాలని తాపత్రయం మొండి ధైర్యం తో బతికేస్తున్నాడు సగటు మధ్యతరగతి వాళ్ళు.ధైర్యాన్ని కోల్పోతే మానసికంగా కున్గిపోతారు అందుకే ధైర్యే సహాసే లక్ష్మి అన్నట్లు నియమాలు పాటిస్తూనే కరోనాతో పోరాడాలి ఒక మనోధైర్యం మరికొందరికి ప్రేరణ మానసికంగా కున్గిపోవద్దు పోరాడు 
ఒత్తిడికి ధైర్యానికి మధ్య సాగే ఘర్షణ మిమ్మల్ని నిర్వీర్యం చేయక ముందే ఒక నిర్ణయానికి రండి మానసిక ధైర్యానికి,మనో బలానికి   మించిన మరో మందులేదంటున్నారు మానసిక నిపుణులు.

కోరోనా వైరస్ ప్యండమిక్ శరవేగంగా విస్త రిస్తున్న వేళ ప్రపంచాన్ని ఊడ్చేస్తోంది. దానికి కారణం భయం ఏమౌతుందో అన్న ఆందోళన కారణం జనాభా వివిధ వర్గాలు అందులో వృద్ధులు రక్షణ కల్పించే వారు వివిదరకాల అనారోగ్య సమస్యల తో ఉన్న వారు ప్రజా ఆరోగ్యం- మానసిక ఆరోగ్యం అన్న విషయాన్ని 
విశ్లేషించి నప్పుడు. మానసిక ప్రభావం చాలా ఉంటుంది కారణం యాన్ క్సైటి, ఒత్తిడి.అనిమాత్రం అనుకుంటారు. ఈ మధ్య కాలంలో నూతనంగా పరిశీలించినప్పుడు మానసిక ప్రభావం ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉన్నప్పుడు వారు తీవ్ర ప్రభావానికి గురైనట్లు గిర్తించారు. వీరు సహజంగా చేసే కార్యక్రమానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ఒంటరిగా ఉన్నామన్న వారిని ఒత్తిడికి గురిచేసింది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాణాంతక మైన మద్యం ఇతర మందులు లేదా  మత్తు పదార్ధాల వాడకం, వారిని వారు గాయ పరుచుకోడం. ఆత్మ హాత్య చేసుకోవలన్న ఆలోచన వారిలో పెరిగిందని మానసిక వైద్యులు గుర్తించారు.

ప్రజా ఆరోగ్యం బాధ్యత దృష్ట్యా డబ్ల్యు హెచ్ ఓ అధిక జనాభా గల దేశాలలో ఇప్పటికే చాలామంది పై  దీని ప్రభావం పడింది. లంబార్టీ, ఇటలీ ప్రాంతాలలో ఈసమస్యను గుర్తించి సేవలు అందిస్తున్నారు. ప్రజలు తీవ్ర మానసిక ఆందోళణ, యాంక్సాయిటీ వల్ల మానసికంగా కృంగి పోతున్నారు. మనో ధైర్యాన్ని 
కోల్పోతున్నారు.ఆరోగ్య కార్యకర్తలు లేదా ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్లు సైతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్తున్నట్లు గుర్తించారు. వారిలో ఆందోళణ కర స్థాయిలో అనారోగ్య సమస్యలు వారిని వేదిస్తున్నాయి.నేడు అవి ప్రాధాన అంశం గ మారి పోయింది. అనారోగ్యానికి చికిత్చ చేయవచ్చు మానసిక అనారోగ్యానికి చికిత్చ లేదనే చెప్పాలి ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో ఈ సమస్య చుట్టు ముట్టింది. మనకు ముఖ్యంగా జీవితం మనుగడ అన్నదే పెద్ద సవాలుగా మారింది. మనం తీసుకునే ఆహారం పూర్తిగా మనకు రోగ నిరోధక శక్తిని ఇస్తుందా నిద్ర అలసట లేదా అనారోగ్యం అనే భావన మనిషిని క్రుంగ దీస్తుంది అది వారి రోజు వారీ కార్యక్రమాల పై పడుతుంది. ఇలా ఇబ్బంది పడుతున్న వారిని బయటకు రప్పించాలి. అందుకే పెద్దవాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పేది ఒక్కటే మానసికంగా ఖుంగి పోకుండా  మానసికంగా ఉండాలంటే మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదు.