ఆటతో పాటు మనసు గెలిచిన ఆటగాడు...

ఆటతో జట్టు ప్రశంసలు పొందటంతో పాటు,ఆడగా వచ్చిన డబ్బును చారిటీకి ఇచ్చి అందరి మనసు గెలుచుకున్న ఆటగాడు, 19 ఏళ్ల యువ సంచలనం ఎంబపె ఇప్పుడు ఫ్రాన్స్‌ హీరో అయ్యాడు. రష్యా వేదికగా ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌ పోటీల్లో ఫ్రాన్స్‌ విజేతగా నిలిచింది.విశ్వ విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌ జట్టు ఆటగాళ్లకు సొంతగడ్డపై ఊహించని రీతిలో స్వాగతం దక్కింది.ఫ్రాన్స్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు ఎంబపె.ఫైనల్లో గోల్‌ కొట్టిన ఎంబపె ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అంతేకాదు ప్రపంచకప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన పిన్న వయస్కుడిగా కూడా ఎంబపె రికార్డు సృస్టించాడు.ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీ ద్వారా ఎంబపె సుమారు 5లక్షల డాలర్లను అందుకోనున్నాడు .అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.4కోట్లకు పైనే.ఈ టోర్నీ ద్వారా తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి ఇస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఈ మొత్తాన్ని వాడాలని స్వచ్ఛంద సంస్థను ఎంబపె కోరాడట.