యూపీ ఎన్నికలపై అనుమానం... సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం..

 

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 403 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 300 కు పైగా స్థానాలు గెలిచి అధికారం చేపట్టింది. అయితే ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు పలు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక బీఎస్పీ పార్టీ అయితే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు ఏకంగా దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఎస్పీ చూస్తుంది. ఈ సందర్బంగా బీఎస్పీ అధినేత మాయవతి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సరళి విషయంలో తమకు పలు అనుమానాలున్నాయని..ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లతో రిగ్గింగ్‌కు పాల్పడి బీజేపీ దొంగదారిలో విజయాన్ని సాధించిందని..  రెండు మూడు రోజుల్లో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు.