మోడీ నాకు సలహా ఇవ్వడం కాదు... మీరు కూడా పాటించండి..


 


మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కూడా సెటైర్లు వేసేస్తున్నారుగా. అది కూడా ఎవరికో కాదు.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే.. మన్మోహన్ సింగ్ గురించి తెలిసిందే. ఆయన పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదు. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి. అందుకే ఆయనపై బీజేపీ నేతలు కామెంట్లు చేస్తుండేవారు. మన్మోహన్ సింగ్ మౌనముని అని... ఆయన సోనియ గాంధీ చేతిలో కీలుబొమ్మ అని.. రబ్బరు స్టాంప్ అని ఇలా చాలా విమర్శలే చేసేవారు. అలా అనీ మన్మోహన్ సింగ్ ఎప్పుడూ వారిపై తిరిగి కామెంట్ చేసిందీ లేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోయేవారు. కానీ టైం ఎంప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ కు టైం వచ్చింది. ఇప్పుడు తనకు ఇచ్చిన సలహానే తిరిగి ఆయన మోడీకి ఇచ్చారు. ఇంతకీ మోడీ మన్మోహన్ సింగ్ కు ఇచ్చిన సలహా ఏంటంటే... తనను మోడీ తరచూ మాట్లాడమంటూ సలహా ఇచ్చేవారిని... ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కనుక తరచూ మాట్లాడాలని మన్మోహన్ సింగ్ అన్నారు.

 

ఎందుకంటే కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై దేశ నలుమూలల నుండి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు తలెత్తాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే... ఈ కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ చాలాకాలం స్పందించలేదు. ఎట్టకేలకు గత శుక్రవారం ఆయన స్పందించారు. ఇక దీనిపై ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్య్వూలో పాల్గొన్న మన్మోహన్ సింగ్ స్పందించి... యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను మౌన్.. మోహన్ సింగ్ అనేవారని.. కానీ ఇప్పుడు ఆయన ఆ సలహాను తానే స్వయంగా పాటించాలన్నారు. అంతేకాదు... అంతకు ముందు కూడా మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సభల్లో కూడా ఆయన పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ మోడీపై విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు చరిత్రలో నిలిచిపోయే నిర్వహణ వైఫల్యమని.. ఏదోశంలోనైనా ప్రజలు తాము డిపాజిట్ చేసిన నగదును విత్ డ్రా చేసుకునేందుకు ఆంక్షలు ఉన్నాయా..? అలాంటి దేశం పేరు ఒక్కటి చెప్పండి అంటూ సూటిగా మోడీని ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి మోడీపై కామెంట్ విసిరారు. దీంతో ఇప్పుడు మన్మోహాన్ సింగ్ కూడా బాగానే సెటైర్లు వేస్తున్నారుగా అని అంటున్నారు. అంతేకాదు.. మన్మోహన్ సింగ్ అన్నదాంట్లో కూడా నిజముంది.. అప్పడు ఆయన్ని మౌనముని అనేవారు.. ఇప్పుడు ఆయన కూడా మౌన మునిలా తయారయ్యారని అంటున్నారు. మరి మాజీ ప్రధాని సలహాను.. ఇప్పటి ప్రధాని పాటిస్తారో లేదో..? చూద్దాం..