లోక్ సభ ఎన్నికల్లో మోసం.. 30 శాతం ఈవీఎంల్లో అక్రమాలు!!

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీల శ్రేణులు ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అలాంటి వ్యాఖ్యలే చేసారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలు మోసపూరితమైనవని, ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల్లో 30 శాతం ఈవీఎంల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని మమతా ఆరోపించారు. పనిచేయని ఈవీఎంల స్ధానంలో మార్చిన ఈవీఎంలను ఏ ఒక్కరూ పరీక్షించలేదని అన్నారు. ఆ ఈవీఎంల్లో మాక్‌ పోలింగ్‌ కూడా నిర్వహించకపోవడంతో ఈవీఎంల్లో ఓట్లు ముందస్తుగా నిక్షిప్తం కాలేదని చెప్పేందుకు ఆధారాలు ఏంటని ఆమె ప్రశ్నించారు. తాము ఈసీని కలిసి పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలను వాడాలని కోరతామని మమతా స్పష్టం చేశారు. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్‌ పత్రాలను ప్రవేశపెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు.