ఒక్క మాట చెప్పడానికి పవన్‌కు అంత ఇగో ఎందుకు..?

గత కొద్ది రోజులుగా కత్తిమహేశ్‌కు పవన్ కళ్యాణ్ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వివాదంతో మూవీ క్రిటిక్ కాస్తా.. పొలిటికల్ క్రిటిక్‌గా మారారు కత్తి మహేశ్. పవన్‌కు మద్ధతుగా నిన్న మొన్నటి వరకు ఫ్యాన్స్ మాత్రమే ఉన్న ఈ వివాదంలోకి టాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి చేరారు.  జబర్దస్త్ ఫేం హైపర్ ఆది, కోన వెంకట్, పూనమ్‌కౌర్‌లు కత్తిపై కత్తి కట్టారు. ఈ నేపథ్యంలో పవన్‌కళ్యాణ్, పూనం కౌర్‌లకు బహిరంగ సవాల్ విసురుతూ.. ఇవాళ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వద్ద మీడియా మీట్‌ను ఏర్పాటు చేశారు కత్తిమహేశ్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పది ప్రశ్నలు వేస్తే.. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని.. నాలుగు నెలలుగా తాను ఎంతో మానసిక స్థితిని అనుభవించానని.. తన అభిమానులని కూడా వారించలేని స్థితిలో పవన్ ఉండటం దురదృష్టకరమన్నారు. అయినా ఒక్క మాట చెప్పడానికి పవన్ కళ్యాణ్‌కు అంత ఇగో ఎందుకని మహేశ్ ప్రశ్నించారు.