పవన్‌కు మద్దతుగా ఎన్టీఆర్, మహేష్ బాబు

 

పవన్ సినిమాలకు బ్రేకిచ్చి పూర్తిస్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టారు.. పవన్ జనసేనకు కుటుంబ సభ్యులు, కొందరు ఆర్టిస్టులు మద్దతు తెలిపారు కానీ స్టార్ హీరోలు ఇంకా మద్దతు తెలపలేదు.. అయితే స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్ పవన్ కు రాజకీయంగా మద్దతు తెలిపినట్టు ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది.. అదేంటి మహేష్ రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉంటారు.. ఇక ఎన్టీఆర్ ఒకప్పుడు టీడీపీ తరుపున ప్రచారం చేసారు, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. అదీకాక తాత స్థాపించిన టీడీపీని కాదని పవన్ పార్టీకి మద్దతు ఎలా తెలుపుతారు? అంటారా.. అసలు విషయం ఏంటంటే.. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్, తరువాత టీడీపీని విభేదించి బయటికొచ్చారు.. ఇప్పుడు విమర్శలు చేస్తూ, వచ్చే ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన, వైసీపీకి మద్దతిస్తుందని ఆరోపణలు వచ్చాయి.. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్, పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తారు, ఈ విషయం పవనే స్వయంగా తనతో చెప్పారని అన్నారు.. దీంతో జనసేన, వైసీపీ కలిసిపోయాయంటూ విమర్శలు మొదలయ్యాయి.. ఈ విమర్శలకు సమాధానంగా పవన్ ట్విట్టర్లో స్పందించారు.. 'పరస్పర బాగోగులు తెలుసుకున్నంత మాత్రాన, వాటిని మీకు నచ్చినట్టు అన్వయించుకోవద్దు' అని పవన్ ట్వీట్ చేసారు.

ఇక్కడే పవన్ కు ఎన్టీఆర్, మహేష్ బాబు మద్దతు అంటూ రచ్చ మొదలైంది.. పవన్ చేసిన ట్వీట్ కి రెప్లైగా మహేష్ బాబు 'i support pawan kalyan' అని, ఎన్టీఆర్ 'me too' అని చెప్పినట్టు ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది.. నిజానికి అవి ఫేక్ ఎకౌంటులు.. మహేష్, ఎన్టీఆర్ పేర్లతో ఉన్న ఫేక్ ఎకౌంటులు నుండి పవన్ కళ్యాణ్ ట్వీట్ కి రిప్లై వచ్చాయి.. సెలబ్రిటీల ఖాతాలకు ‘టిక్’ మార్క్ ఉంటుందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా, బాధ్యతారాహిత్యంగా ఇలా ప్రచురించడంతో నెటిజనులు ఆ పత్రికపై మండిపడుతున్నారు.. వార్త తెలియగానే ప్రచురించడం కాదు వాస్తవం తెలుసుకొని ప్రచురించాలని సూచిస్తున్నారు.