శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శివాలయాలు కిటకిటలాడుతున్నాయి.. అర్థరాత్రి నుంచే ఉపవాసం, జాగరణ దీక్ష, శివపార్వతుల కళ్యాణంలో పాలుపంచుకుంటూ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి లేలుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, అమరావతి తదితర ఆలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.. ఇక శివరాత్రి ఉత్సవాలకు ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లా కోటప్పకొండపై ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు కనిపిస్తున్నారు. సుమారు 20కి పైగా భారీ ప్రభలు.. కొండపై కొలువుదీరాయి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.