దారి తప్పిన రైలు..

 

ఓ రైలు దారి తప్పింది. విచిత్రంగా ఉంది కదా. రైలేంటి..? దారి తప్పడం ఏంటి అని అనుకుంటున్నారా..? నిజంగానే ఓరైలు దారితప్పింది. అదెంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు సోమవారం దిల్లీకి తరలివచ్చి జంతర్‌మంతర్‌ వద్ద కిసాన్‌ యాత్ర పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆందోళన ముగించుకుని తిరిగి మహారాష్ట్ర వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు దారి తప్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 160 కిలోమీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని బాన్మోర్‌ స్టేషన్‌ చేరుకుంది. అప్పటికి కానీ కళ్లు తెరవలేదు అధికారులు. తాము దారితప్పామని. దీంతో అందులో ప్రయాణిస్తున్న 1500 మంది రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వూరూ పేరు తెలియని ప్రాంతంలో ఇలా చిక్కుకుపోయామని.. ఇంత జరిగినా ఒక్క రైల్వే అధికారి కూడా ఇక్కడకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.