మహా రాజకీయంలో మహానీయ మార్పులు :- రాష్ట్రపతే రాజు కానున్నాడా ?

 

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన దేనికి సంకేతం. శివసేన సాధించలేకపోయిన మద్ధతు ఇప్పుడు ఎన్సిపి సాధించగలుగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికల ఫలితాల వచ్చినప్పట్నుంచి మహారాష్ట్ర రాజకీయలు మొత్తం అనూహ్య మలుపులు తిరుగుతుంది. శివసేనకు మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు బంతి పవార్ కొర్ట్ లోకి వచ్చి పడింది.

కాంగ్రెస్ అంగీకరిస్తే శివసేనకు మద్దతిచ్చేందుకు ఎన్ సిపి సిద్ధంగానే ఉంది. అయితే స్వయంగా ఉద్ధవ్ థాక్రే ఫోన్ చేసినా సోనియా ఎలాంటి హామీ ఇవ్వలేదు. శివసేనకు మద్దతివ్వడంపై కాంగ్రెస్ పట్ల భిన్నవాదనలు వినిపించాయి. దీంతో నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారు సోనియా గాంధీ. మూడో అతిపెద్ద పార్టీగా ఎన్ సిపి ని గవర్నర్ ఆహ్వానించడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యా అధ్యాలపై లెక్కలేసుకుంటున్నారు శరద్ పవార్.మొత్తంగా మహరాష్ట్ర ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సంక్లిష్టంగా మారింది. ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన మ్యాజిక్ నెంబర్ కు చేరుకొనే ఎన్సీపీకి 54 మంది కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. సభలో రెండు పార్టీల బలం 98 మంది మాత్రమే ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేన మద్దతు తప్పనిసరిగా మారింది.

ముఖ్య మంత్రి పీఠం కోసం బిజెపితో తెగతెంపులు చేసుకున్నా.. శివసేన ఇప్పుడు ఎన్సిపికి మద్దతిచ్చి ఆ పార్టీ నేతలను సీఎంగా చేస్తుందా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ఎన్సీపీకి మద్దతు ఇవ్వాలంటే సీఎం పదవిని రొటేషన్ పద్ధతిలో పంచుకున్నామని శివసేన షరతులు విధించే అవకాశము లేకపోలేదు. ఇటు శివసేన మద్దతు ఖచ్చితంగా తీసుకోవాలి.. శివసేన సీఎం పదవి కోసం బీజేపీతో పొత్తు వదులుకున్న నేపథ్యంలో శివసేన ఇరకాటంలో పడిందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పి ఎన్డీయే నుంచి ఏకంగా బయటకొచ్చేసింది శివసేన. కేంద్ర మంత్రి పదవిని శివసేన నేత రాజీనామా చేసి బయటకొచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తమకిచ్చిన గడువు తీరిపోగా గవర్నర్ ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు.

ఇవాళ ( నవంబర్ 12న )  రాత్రి ఎనిమిదిన్నర లోపు ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించాలని ఎన్సిపికి డెడ్ లైన్ పెట్టారు గవర్నర్. ఆలోపు ఎన్ సిపికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకోపోతే రాష్ట్రపతి పాలన విధించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు రెండు రోజుల గడువు ఇచ్చేందుకు నిరాకరించిన గవర్నర్ ఎన్సిపికి కూడ డెడ్ లైన్ పొడిగించే అవకాశం లేదు.ఇవాళ ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన మధ్య జరిగే చర్చలే మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి. కాంగ్రెస్ ఎన్సీపీ నేతలు ఢిల్లీ ముంబయిలో చర్చలు జరపనున్నారు.కాంగ్రెస్ సీనియర్ నేతలు ముంబయి వెళ్లి శరద్ పవార్ ను కలవనున్నారు. ఎన్సిపికి కాంగ్రెస్ కు శివసేన మద్దతిస్తుందా.. ఒకవేళ ఇస్తే ఎలాంటి కండీషన్స్ పెడుతుందన్నది ఆసక్తిగా మారింది.