ఇది ఫైనల్.. మహారాష్ట్ర లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న శివసేన

 

మరాఠా రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఒకటై రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. అయితే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో సెట్ కాలేదు. మరో రెండు మూడు రోజుల్లో మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 5 ఏళ్ల పాటు శివసేనకే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ , ఎన్సీపీలు అంగీకరించాయి. ఈరోజు గవర్నర్ భగతసింగ్ కోషియారిని కలిసి మెజారిటీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి మూడు పార్టీలు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరనున్నాయి.సీఎం సీటు గురించి బీజేపీ, శివసేనల మధ్య గొడవ వచ్చినందున ఆ పదవిని శివసేనకే వదిలేస్తామన్నారు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్. శివసేన తన గౌరవాన్ని తిరిగి పొందేలా సహకరిస్తామన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కూడా కుదిరింది. సీఎం సీట్ ను 5 ఏళ్ల పాటు శివసేనకే అప్పగించటం.. ఎన్సీపీ, కాంగ్రెస్ లకు ఒక్కో డిప్యూటీ సీఎం పదవి మూడు పార్టీలకు తలో 14 మంత్రి పదవులు కాంగ్రెస్, ఎన్సీపీలకు కీలకమైన హోం రెవెన్యూ అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మూడు పార్టీలతో ఏర్పడబోయే ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా పాలన చేస్తుందన్నారు శరత్ పవార్. శివసేన హిందూత్వ పార్టీనే అయిన కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం సెక్యులరిస్టు ఐడియాలజీ పై కాంప్రమైజ్ కాబోవన్నారు. 

రాష్ట్ర నేతలు ఓకే చేసిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై రేపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించనున్నారు శరత్ పవార్. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో ఇంకా కొన్ని అంశాలు తేలాల్సి ఉంది. దానిని మహారాష్ట్ర వరకే పరిమితం చేయడమా లేదంటే నేషనల్ లెవల్ లో అమలుచెయ్యటమా అనేది తేలలేదు. యూనిఫాం, సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ ల బిల్లు, వీర్ సావర్కర్ కు భారత రత్న విషయాల్లో ఇంకా అభిప్రాయాలూ కుదరలేదు. పవార్, సోనియా మీటింగ్ లోనే విధానాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.మహారాష్ట్రలో 25 ఏళ్లు ఇక శివసేనదే అధికారమన్నారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్. రెండు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేప్పుడు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఆధారంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాల్సి ఉంటుందన్నారు. 

బీజేపీ లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోదన్నారు పార్టీ స్టేట్ చీఫ్ చంద్ర కాంత్ పాటిల్. తాము మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని చెప్పారు. తమ దగ్గర అత్యధికంగా 119 మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతలతో భేటీ తర్వాత ఆయన మాట్లాడారు. హిందుత్వ ఐడియాలజీని శివసేన వదులుకుంటోందని తాను అనుకోవడం లేదన్నారు వీరసావర్కర్ ముని మనవడు రంజిత్. అలాగే వీర్ సావర్కర్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గబోదన్నారు. హిందుత్వ విషయంలో కాంగ్రెస్ మైండ్ సెట్ ను శివసేన మారుస్తుందన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తాయని ప్రశ్నిస్తూ హిందూ మహాసభ ప్రతి నిధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూటమికీ.. ప్రజాతీర్పుకు అది విరుద్ధమన్నారు. అయితే ఈ కేసు విచారణ అంత అత్యవసరం కాదని సుప్రీం ప్రస్తుతానికి విచారించలేదు. వచ్చే వారం విచారణకు వచ్చే చాన్సుంది.