రామమందిర పోరాట యోధుడు భాస్కర్ దాస్ కన్నుమూత

జీవితాంతం అయోధ్యలోరామాలయం కోసం పరితపించిన నిర్మోహీ అఖడా చీఫ్ మహంత్ భాస్కర్ దాస్ కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. 1929లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించిన ఆయన 1946లో అయోధ్యకు వచ్చారు..1949 నుంచి రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వ్యవహరాల్లో భాగస్వామ్యమయ్యారు. రామాలయం నిర్మాణమే తన జీవితాశయం అన్నట్లు పోరాడారు..అయోధ్యలోని వివాదాస్పద భూమి తమేదనని దశాబ్ధాలుగా వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు..2003, 2007 సంవత్సరాల్లో ఆయన రెండు సార్లు గుండెపోటుకు గురయ్యారు. ఆరోగ్యం సహకరించకపోయినా తన పోరాటాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున మరోసారి గుండెపోటుకు గురికావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల వీహెచ్‌పీ, సంఘ్ పరివార్, బీజేపీ సహా పలు పార్టీల నేతలు సంతాపం తెలియజేశారు.