కిరణ్ బేడీని హిట్లర్ తో పోలుస్తూ పోస్టర్లు...

 

పుదుచ్చేరి రాజకీయాలు మరింత వేడెక్కాయి. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీకి, అధికార పార్టీకి మధ్య గత కొద్దిరోజుల నుండే వివాదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై వివాదం రోజురోజుకి పెరిగిపోతుంది. జూలై 4న ముగ్గురు నేతలను కేంద్రం ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం, ఆపై కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయించడంపై కాంగ్రెస్ పార్టీనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ బేడీని ఏకంగా జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ పోస్టర్లు అంటించారు. ఇప్పుడు ఇది మరో వివాదానికి దారితీసింది. కిరణ్ బేడీ ఓ నియంతగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తోపాటు డీఎంకే, వాపపక్షాలు, వీసీకేలు మూకుమ్మడిగా బేడీ చర్యలను వ్యతిరేకించడంతో పాటు ఆమెను వెనక్కు పంపాలని, డిస్మిస్ చేయాలని నినాదాలు చేస్తున్నారు.