బండి ఆగితే..ఇక అంతే..ప్లాస్టిక్ బాటళ్లలో పెట్రోల్ అమ్మమంటున్న యజమానులు


అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య అనంతరం జంట నగరాల్లో పెట్రోల్ బంక్ యజమానులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకూడదని.. పెట్రోల్ బంకుల్లో యజమానుల బోర్డులు సైతం పెడుతూ జనానికి అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు పంచర్ షాపులో బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం తెలిసిందే.

రోడ్డు పై వెళ్లే వాహన దారులు పెట్రోల్ బంకు అందుబాటులో లేనప్పుడు వీరి వద్ద కొనుగోలు చేస్తారు. అయితే ఇది కూడా చట్ట విరుద్ధమని అంటున్నారు పెట్రోల్ బంక్ యజమానులు. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనల తర్వాత ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.వాహన దారుల పరిస్థితి గమనించి అమ్ముతానంటున్నారు.  పెట్రోల్ ను బాటిళ్లో తీసుకెళ్లి  ఎమ్మార్వో హత్య చేశారు. పెట్రోల్ బంకు డీలర్లు అందరం కలసి ఒక నిర్ణయానికి వచ్చామని.. ఇలా అమ్మడం వల్ల జరగకూడనివి జరుగుతున్నాయి కాబట్టి నిజాయితీగా ఎవరికైతే అవసరముందో వాళ్లకే బాటళ్లో ఇవ్వబడుతుందన్నారు.

మామూలుగైతే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిచేశామని.. ఇంకా ఏమైనా ఆదేశాలు వస్తే మొత్తంగా ఆపేస్తామన్నారు. కేవలం కస్టమర్ ని  దృష్టిలో పెట్టుకొని వాళ్ల ఇబ్బంది తొలగించటానికి మాత్రమే ఒక సహాయక రూపంలోనే ఇవ్వడం జరుగుతుందని ఏ యజమాని వెల్లడించారు.మరోవైపు బంక్ యజమానుల ఆదేశాలనుసారం తాము బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం లేదని.. అది ఎప్పటి నుంచో అమల్లో ఉందని బంక్ లో పని చేసే ఉద్యోగులు చెప్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్రోల్ పోయడం వల్ల మంటలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.