తెలంగాణ లోకి ఎంట్రీ ఇలా.. ఏపీ లోకి మాత్రం అలా...

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 1 మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రాల మధ్య రాకపోకల పై ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ కు రావాలంటే ఎటువంటి పర్మిషన్ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే అంతర్రాష్ట్ర బస్సులు మాత్రం ప్రస్తుతానికి నడపడం లేదని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే ఏపీలోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇతర రాస్జ్త్రాల నుండి ఏపీకి రోడ్ మార్గం ద్వారా రావాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏపీకి రావాలనుకున్న వారు స్పందన పోర్టల్ ద్వారా అప్లై చేసుకుని పాస్ తీసుకుని రావాలని అయన తెలిపారు. ఐతే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ఏపీకి వస్తున్న వారిని చెక్ పోస్టుల వద్ద చెక్ చేసి పాస్ లు ఉన్నవారినే మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాల క్యూ పెరుగుతూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుండి వచ్చే వారు 14 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అలాగే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుండి వచ్చే వారు మాత్రం 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని.. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే 7రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని అయన తెలిపారు.