లోక్ సభ రేపటికి వాయిదా..

 

 

 

సీమంధ్ర నాయకుల నినాదాలతో లోక్ సభ బుధవారం దద్దరిల్లింది. వాయిదా తర్వాత ప్రారంభమైన సభ సీమాంధ్ర ఎంపీల అరుపులతో మార్మోగింది. రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రికి మల్లికార్జున ఖర్గేకు వీరు అడుగడుగునా అడ్డుతగిలారు. మంత్రులు కావూరి, పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి లు వెల్ లోకి వచ్చి నిరసన తెలిపారు. కిశోర్ చంద్రదేవ్,కృపారాణి తమ స్థానాల్లో నిల్చుని నిరసన తెలిపారు. వీరికి ప్రతిగా తెలంగాణా ఎంపీలు కుడా నినాదాలు చేసారు. ఖర్గే ప్రసంగిస్తున్న సమయం లో సీమాంధ్ర ఎంపీలు విభజన బిల్లు ప్రతుల్ని చింపి విసిరేశారు. దీంతో ఆయన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.