పెంపుడు రోబో కుక్క పిల్ల!

 

 

 

 

పెంపుడు జంతువులని మచ్చిక చేసుకుని వాటితో గడిపితే ఒత్తిడి వంటివి తగ్గుతాయని అందరికి తెలిసిందే. అయినా ఏ బుజ్జి కుక్క పిల్లనో తెచ్చుకుని పెంచుకోవాలంటే ఇల్లు సరిపోదు, పైగా దాని కోసమన్నా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయక తప్పదు. ఇంట్లో పిల్లలుంటే ఏవన్నా ఎలర్జీలు వస్తాయేమోనని భయం . ఇలా ఎన్నో సందేహాలతో పెంపుడు జంతువులని చేరదీయలేక పోతున్నామని భాదపడే వారి కోసం రోబోలని తయారు చేసారు. ఇవి అచ్చం ప్రాణం వున్న కుక్కపిల్లలనే కనిపిస్తాయి. పైగా ప్లాస్టిక్, సిలికాన్లతో తయారుచేసిన వీటి పొట్ట నిండా సెన్సార్లు ,కెమెరాలు, మైక్రోఫోన్ లు పెడతారు. దాంతో ఆ కుక్క మనతో ఆడుతుంది, గెంతుతుంది,నిద్రపోతుంది మన ఒళ్లో ఎక్కి గారాలు పోతుంది. అంతే కాదు దీనికి కోపం, భాద , అన్ని తెలుస్తాయట! ఓ పెంపుడు కుక్కపిల్లలా అన్ని రకాలుగా మనల్ని అడిస్తుందట. బుజ్జి కుక్కపిల్లని పెంచుకుందాం అంటూ మారాం చేసే పిల్లలకి ఈ రోబో కుక్కపిల్లని బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఓ 349 డాలర్లు అంటే మన రూపాయల్లో ఓ పదిహేడు వేలు ఖర్చు పెట్టాలంతే.

....రమ