జపాన్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఇదే..

 

జపాన్ ఈ పేరు వినగానే ముందుగా కళ్లేదుట కనిపించేది హిరోషియా, నాగసాకి అణు విలయం. జపానికి లొంగిపోవడానికి సిద్ధపడింది. అయినా అమెరికా అత్యంత అమానవీయ పద్ధతిలో ఈ రెండు నగరాలపై అణుబాంబులు వేసింది. ఈ దాడులలో దాదాపు 2 లక్షలకు పైగా చనిపోయారు. ఆ దాడుల దుష్ఫరిణామాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయంటే నాటి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు నిత్యం భూకంపాలతో సహవాసం, అగ్నిపర్వతాల విస్పోటనాలు, కబళించే సునామీలు అలాంటి దేశం ఆత్మవిశ్వాసంతో, ప్రజల శ్రమశక్తితో, దేశభక్తితో అభివృద్ధి విషయంలో అగ్రరాజ్యాల సరసన నిలబడింది.  

             

ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. ఆయన జపాన్ పౌరుడు. ఆయన తొంభై సంవత్సరాల వయసు వరకు పనిచేస్తూనే ఉన్నాడు. అంతే కాదు జపనీయుల సగటు జీవిత కాలం 86.3 సంవత్సరాలు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో జపాన్‌కు అది ఎలా సాధ్యమైంది అంటే అందుకు కారణం వారి శ్రమ శక్తి, ఆహారపు అలవాట్లు.

 

* వీరు తమదైన సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. చేపలు, వరిఅన్నం, ఉడికించిన కూరగాయలు ఎక్కువగా        తీసుకుంటారు.

 

* మన దేశాల్లో వృద్ధులంటే చిన్పచూపు. ఎప్పుడెప్పుడు వారిని వదిలించుకుందామా అంటూ ఎదురుచూస్తారు వాళ్ల పిల్లలు.    కాని జపాన్‌‌లో వృద్ధుల పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వైద్య  సదుపాయం తేలిగ్గా అందుబాటులో  ఉంటుంది.

 

* జపాన్ ప్రజలు శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మనస్తత్వం వారి జీవితాల్లోని అన్ని కోణాల మీద మంచి    ప్రభావాన్ని చూపుతోంది. విద్య, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ వీటన్నింటిపై వారి శ్రద్ధ కనిపిస్తోంది.  దానికి తోడు అక్కడ షింటో అనే సంప్రదాయం ఉంది. దీని ప్రకారం ఇతరులను కలిసే ముందు శరీరం, మనసు శుచిగా  ఉండాలని జపాన్ వారు నమ్ముతారు.

 

* వీరిలో ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువగా ఉంటుంది. పాఠశాలల్లోనూ..కర్మాగారాలు, కార్యాలయాల్లో ఆరోగ్య పరీక్షలు జరుగుతుంటాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యత ఇస్తుంది.

 

* ఆహారాన్ని పీకల దాకా తొక్కకుండా, 80 శాతం పొట్టనిండగానే తినడం ఆపేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఒబేసిటీ సమస్య అనేది కనిపించదు.

 

సో..జపాన్ చాలా గొప్పదేశమండీ..నాశనం అయినా ఎంత గొప్పగా డెవలప్ అయ్యిందో చూశారా..? అని స్టాటిస్టిక్స్ చూసి ముఖం చిట్లించుకోనక్కరలేదు. అవి డెవలప్ అయ్యాయి అంటే అక్కడి పౌరులు తమ పని తాము శ్రద్ధగా చేసుకుపోతున్నారు. వారేమి ఓవర్ టైం చెయ్యడం లేదు. తమకు వచ్చే జీతానికి సరిపడా తాము కంట్రిబ్యూట్ చేస్తున్నారు. తాము కష్టపడితే దేశానికి సముద్రంలో నీటి బొట్టంత అయినా లాభం చేకూరుతుందన్న కనీస స్పృహ వారికుంది. మొత్తానికి క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, ఆరోగ్యకరమైన తాజా ఆహారం, పరిశుభ్రత, కడుపునిండా తినకపోవడం ఇవే  జపాన్‌ని ప్రపంచంలో అత్యున్నత  స్ధితిలో నిలబెట్టింది.