షికంజి సోడా తాగితే ఎంత మంచిదో తెలుసా...?

మన దేశంలో ఎండాకాలం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మంచి ఎండల్లో బయటకి వెళ్లాల్సి వస్తే... ఒళ్లంతా మంటెక్కిపోక తప్పదు. అలాంటప్పుడు రోడ్డు పక్కన ఆగి ఓ గుక్కెడు లెమన్ సోడా తాగితే కావల్సినంత రిలీఫ్‌ దొరుకుతుంది. రోడ్డు పక్కన తయారుచేసే లెమన్‌సోడాని షికంజి అని పిలుస్తారు. ఇందులో సోడాతో పాటు ఉప్పు, పంచదార, అల్లం, జీరాపొడి, నల్ల ఉప్పు కూడా కలుపుతారు. దీని వల్ల దాహం చల్లారడమే కాదు... చెప్పలేనన్ని లాభాలు ఉంటాయట. అవేంటో మీరే చూడండి...

ఎండాకాలం మనకి తెలియకుండానే ఒంట్లో నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఇంకా చెమటతో పాటు శరీరానికి చాలా అవసరమయ్యే సోడియం అనే మినరల్ కూడా బయటకి వెళ్లిపోతుంది. ఇది డీహైడ్రేషన్‌ లాంటి చాలా సమస్యలకి దారితీస్తుంది. షికంజిలో కలిపి ఉప్పు, పంచదార ORSలాగా పనిచేసి ఒంటికి కావల్సినంత బలాన్ని ఇస్తాయి.

ఎండాకాలంలో డైజషన్‌ చాలా sensitiveగా ఉంటుంది. దానికి తోడు చల్లదనం కోసం మనం రకరకాల డ్రింక్స్‌ తీసుకుంటూ ఉంటాం. వీటన్నింటి వల్ల కూడా digestion upset అవుతుంది. కానీ షికంజిలో ఉండే నల్ల ఉప్పు, అల్లం, జీరాపొడి, నిమ్మరసం... అన్నీ కూడా మన digestive systemని healthyగా ఉంచుతాయి.

షికంజి తాగడం వల్ల immunity పెరుగుతుంది. దీనిలో ఉన్న నిమ్మరసం వల్ల మన ఒంటికి కావల్సిన విటమిన్ సి దొరుకుతుంది. విటమిన్‌ సి వల్ల పళ్ల దగ్గర నుంచీ గుండె దాకా ఒంట్లో అన్న organs healthyగా ఉంటాయి. ఇక అల్లంలో gingerol అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక natural antibiotic గా painkiller గా పనిచేస్తుందట.

షికంజితో weight loss కూడా సాధ్యమే అంటున్నారు. షికంజిలో pectin అనే పీచు పదార్థం ఉంటుంది. ఇది ఒంట్లో కొవ్వుని కరిగించేస్తుంది. ఒంట్లో ఉన్న విషాన్నంతా బయటకి పంపేసే detoxing agentలాగా షికంజి పనిచేస్తుంది. దాని వల్ల లివర్ పనితీరు మెరుగుపడి, కొవ్వు కణాలన్నీ కరిగిపోతాయి.

చూశారుగా! normal drinkలాగా కనిపించే షికంజి వెనుక ఎన్ని లాభాలున్నాయో. ఒకవేళ దీన్ని బయట రకరకాల నీళ్లు కలుపుతారు కాబట్టి, తేడా చేస్తాయి అనుకుంటే ఇంట్లోనే మామూలు నీటితోనే షికంజి తయారుచేసుకోవచ్చు.