లాలూకి మరో షాక్... మరో కేసులో చార్జిషీట్ దాఖలు..


ఇప్పటికే దాణా కుంభకోణంలో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. పశు దాణా స్కాం కేసులో రాంచిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు లాలు ప్రసాద్‌ యాదవ్‌తో సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల జైలుశిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు నాలుగో కేసులో కూడా లాలూని దోషిగా తేల్చి విధించింది కోర్టు. 1990ల్లో దుమ్‌కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది. ఇక ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది. రైల్వే హోటళ్ల టెండర్ల కేసులో కూడా ఇప్పుడు లాలూపై సీబీఐ అభియోగపత్రాలను దాఖలు చేసింది. కేంద్ర రైల్వేమంత్రిగా లాలు ఉన్నప్పుడు రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలుప్రసాద్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలు భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి కూడా ఉన్నారు.