లాలూకి జైలుశిక్ష పడింది..

 

ఎట్టకేలకు లాలూకి జైలు శిక్షపడింది. గత రెండు రోజులుగా వాయిదా పడుకుంటూ వచ్చిన దాణా కుంభకోణం కేసు తుదితీర్పు నేడు ఖరారైంది. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, ఐదు లక్షల జరిమానా కూడా విధించింది. లాలూతోపాటు ఉన్న మిగిలిన దోషులకు కూడా మూడున్నరేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల ఫైన్‌ను కోర్టు విధించింది. మరోవైపు తీర్పుపై పైకోర్టుకు వెళతామని లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ చెప్పారు. కాగా 1990-94 మధ్య కాలంలో దియోగర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ నుంచి రూ. 84.5 లక్షల అవినీతి జరిగినట్టు లాలూపై కేసు నమోదైంది.