ఇదెక్కడి తీర్పు.. మళ్లీ వాయిదా..

 

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత‌ లాలూ ప్ర‌సాద్ శిక్ష తీర్పు... ఈరోజు కూడా వాయిదా పడింది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ను దోషికా తేల్చుతూ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ కేసులో తీర్పును జనవరి 4 కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నిన్న విచారణ జరిపిన కోర్టు.... ఈరోజుకు వాయిదా వేసింది. ఇక ఈ రోజు కూడా శిక్ష ఖరారు కాలేదు. మళ్లీ తీర్పును రేపటికి వాయిదా వేసింది కోర్టు. లాలూ ప్ర‌సాద్ స‌హా మిగ‌తా దోషులకు శిక్ష ఖరారు కూడా వాయిదా పడింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు తక్కువ శిక్ష విధించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది చిత్త‌రంజ‌న్ సిన్హా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఆయన జార్ఖండ్‌ రాంచీలోని సీబీఐ కోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణం కేసులో దోషుల‌కు రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌డ్జి శిక్ష ఖ‌రారు చేస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మరి రేపైనా తీర్పునిస్తారో..? లేదో.. వాయిదా వేస్తారో...? చూద్దాం... కాగా... కాగా 1990-94 మధ్య కాలంలో దియోగర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ నుంచి రూ. 84.5 లక్షల అవినీతి జరిగినట్టు లాలూపై కేసు నమోదైంది.