బస్సు లో 3 కోట్లు.. కిలో బంగారం..  

కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు  వద్ద రూ.3.05కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు తరలిస్తుండగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు సీజ్‌ చేశారు. డబ్బు తరలిస్తున్న బెంగళూరుకు చెందిన చేతన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని రామచంద్ర వైద్య కళాశాలకు చెందిన నగదుగా నిందితుడు చెప్పినట్టు  కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. మరో బస్సులో కిలో బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై ఇంటర్నేషనన్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 1.36 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానంలోని వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా విమాన సిబ్బంది బంగారాన్ని గుర్తించారు.

వెంటనే సిబ్బంది.. కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు విమానంలో బంగారం ఎవరు దాచారనే విషయంపై ఆరా తీస్తున్నారు.