‘కారు’కూతల కేటీఆర్!

 

ktr seemandhra, telangana, samaikyandhra, congress, Assembly Prologue, cm kiran kumar reddy

 

 

‘కారు’ను తమ పార్టీ సింబల్‌గా పెట్టుకున్న టీఆర్ఎస్ నాయకులకి సీమాంధ్రుల మీద కారుకూతలు కూయడమంటే చాలా ఆస్తకి. సీమాంధ్రులకు మండేలాగా కారుకూతలు కూయడంలో కేసీఆర్ తర్వాతి స్థానం కోసం కేసీఆర్ కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావు పోటీ పడుతూ వుంటారు. ఆ పోటీలో కేటీఆర్‌దే పైచేయి అవుతూ వుంటుంది. నిన్నగాక మొన్ననే అదనపు ఆదాయం వెతుక్కుంటూ అమెరికా నుంచి తెలంగాణ ఉద్యమంలోకి దూకిన కేటీఆర్ భారత రాజ్యాంగం మొత్తాన్నీ ఔపోసన పట్టేసినట్టు మాట్లాడుతూ వుంటాడు. పచ్చి అబద్ధాలు చెప్పేటప్పుడు ఎంతమాత్రం జంకు, గొంకు కనబర్చని కేటీఆర్ని చూస్తుంటే ముచ్చటేస్తూ వుంటుంది. ఎంతయినా దొరబిడ్డ దొరబిడ్డే అనిపిస్తూ వుంటుంది.

 

 

తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా చేయడానికి కొంతమంది ‘రోగ్’లు అసెంబ్లీని ప్రొరోగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. సరే కేటీఆర్ ఇక్కడితే ఆగితే బాగుండేది.. కానీ అలా ఆగితే ఆయన కేటీఆర్ ఎందుకవుతాడు? అసెంబ్లీకి తీర్మానం వచ్చినా రాకపోయినా, అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందినా పొందకపోయినా తెలంగాణ బిల్ పాస్ అయ్యేలా చేసే అధికారం రాష్ట్రపతికి వుందట. అంచేత తమకేం భయం లేదట. రాష్ట్రపతి చెప్పాల్సిన పాయింట్ కూడా చెప్పేస్తున్న కేటీఆర్ భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో ఏంటో!




ఇంకా ఏంటంటే, భద్రాచలం విషయంలో సీమాంధ్రులు అనవసరంగా హడావిడి చేస్తున్నారట. ఆరు నూరైనా భద్రాచలం తెలంగాణలోనే వుంటుందట. ఇదిలా వుంటే, ఢిల్లీలో వున్న అమెరికా రాయబార కార్యాలయంలో పొలిటికల్ ఆఫీసర్లు మరియం సిమెంట్‌వాలా, ట్రావిస్ కోబర్లీ అనేవాళ్ళు, ఇంకా హైదరాబాద్‌లో వున్న అమెరికా రాయబార కార్యాలయ అధికారులు జాన్, శ్రీమాలి తెలంగాణ భవన్‌కి వెళ్ళి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ నాయకుడు శ్రవణ్‌ని కలిశారట. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ గురించి వీళ్ళిద్దర్నీ అడిగి తెలుసుకున్నారట. సీమాంధ్రుల రక్షణ గురించి అడిగితే సీమాంధ్రులే అడగాలిగానీ, సీమాంధ్రులను భయపెట్టేవాళ్ళనే అడగటమేంటో! అమెరికా అధికారులు  ఆ అడిగేదేదో ప్రభుత్వ అధికారులను అడగాలిగానీ, కేటీఆర్, శ్రవణ్‌లని అడగటమేంటో!  అంతేలే, సీమాంధ్రవాళ్ళని బెదిరించేవాళ్ళనే అడగటం బెస్టని అమెరికావాళ్ళు అనుకున్నారేమో!