నెటిజన్లకు కేటీఆర్ కౌంటర్... సినిమాలు చూస్తే తప్పేంటి..!

 

సినిమా బావుందని మెచ్చుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ పై పలు ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆ విమర్శలపై స్పందించిన కేటీఆర్ వారికి కౌంటర్ ఇచ్చాడు. కేటీఆర్ ఇటీవల విడుదలైన తొలిప్రేమ సినిమా చూసి.. సినిమా చాలా బావుందని... వరణ్ తేజ్, రాశీ ఖన్నా చాలా బాగా నటించారని తన ట్విట్టర్ లో ప్రశంసిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. అంతే.. దీనికిగాను నెటిజన్లు కేటీఆర్ విమర్శలు స్టార్ట్ చేశారు. ఇక తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన కేటీఆర్ ట్విట్టర్ లోని తన డీపీని మార్చుకోవడంతో పాటు తన ఇష్టాయిష్టాలు తనకుంటాయని కౌంటర్ ఇచ్చాడు. సినిమాలు చూసినా, డీపీలు మార్చుకున్నా తప్పేంటని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నంత మాత్రాన, వ్యక్తిగత జీవితాన్ని వదిలేయాలా?.. ఇష్టమైతేనే ట్విట్టర్ లో తనతో ఉండాలని, లేకుంటే తనను ఫాలో కావడం మానేయాలని సలహా ఇచ్చారు. తాను సినిమాకు వెళితే కొందరికి సమస్యగా ఎందుకు అనిపిస్తోందో అర్థం కావడం లేదన్నారు.