నానికి దిమ్మతిరిగిందిగా..

 

వైసీపీ అధినేత జగన్ కే కాదు... ఈమధ్య ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానికి కూడా ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అది కూడా ఆయన నియోజక వర్గం అయిన గుడివాడలో. గుడివాడ అంటే టీడీపీకి కంచుకోట లాంటిది. అలాంటి గుడివాడలోనే.. చంద్ర‌బాబు ద‌య‌తో కొడాలి నాని 2004, 2009 ఎన్నిక‌ల్లో రెండుసార్లు వ‌రుస‌గా టీడీపీ నుంచి గెలిచారు. ఆ తరువాత టీడీపీని దెబ్బకొట్టి... వైసీపీలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచాడు. ఇక వైసీపీ లో చేరిన తరువాత నాని గారి నోటికి రెక్కలు వచ్చినంత పనైంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్సలు గుప్పిస్తూనే ఉన్నాడు.

 

ఇక చాలా ఆశతోనే వైసీపీ పార్టీలో చేరిన నానికి పాపం షాక్ తగిలింది. ఇంకేముంది టీడీపీ ఓడిపోతుంది.. వైసీపీ గెలుస్తుంది.. అని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. టీడీపీ గెలిచింది. దాంతో నాని మంత్రి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇంకేం చేస్తాడు.. పాపం ఆ కోపంతో... నాని స‌హ‌నం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా చంద్ర‌బాబును, టీడీపీని ప‌దే ప‌దే టార్గెట్‌గా చేసుకుని..తీవ్ర‌మైన ప‌దజాలం కూడా వాడుతున్నారు. అయితే నానిని టార్గెట్ చేసేందుకు కొద్ది రోజులుగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ చేస్తున్నారు. ఇది కొంత వరకూ సక్సెస్ కూడా అయింది. దీనిలోభాగంగానే.. వైసీపీ మునిసిప‌ల్ చైర్మ‌న్ య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావు టీడీపీలోకి జంప్ చేసేశారు. ఆయ‌న పార్టీ మార‌డంతో నానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన గుడివాడ మునిసిపాలిటీ కౌన్సెల‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కూడా నాని ద‌గ్గ‌రుండి మ‌రీ ప్ర‌చారం చేసి కోట్లు గుమ్మ‌రించినా వైసీపీ ఓడిపోయింది. తాజాగా మరో షాక్ తగిలింది. ఈ రోజు మునిసిప‌ల్ ప్ర‌తిప‌క్ష నేత చోర‌గుడి ర‌వికాంత్ టీడీపీలో చేరారు. దీంతో నానికి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు.. వైసీపీలోని కిందిస్థాయి నాయకులను కూడా టీడీపీలోకి రప్పించేందుకు అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరి ముందు ముందు నానికి ఇంకెన్ని షాకులు తగులుతాయో చూడాలి.