సీఎం కిరణ్ ఢిల్లీ టూర్: ఆజాద్ అసంతృప్తి

 

 

 kiran kumar reddy azad, kiran sonia gandi, sonia gandi kiran kumar reddy

 

 

అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఆజాద్ తో భేటి అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ పైన, రాష్ట రాజకీయాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శంకర్రావు, మజ్లిస్ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీలపై ప్రభుత్వం వ్యవహించిన తీరు పై ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.


శంకర్ రావు, ఓవైసీ అరెస్ట్ పై కిరణ్ ఆజాద్ కి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆతరువాత సహకార ఎన్నికల నివేదికను కూడా ఆయన సమర్పించారు. మొదటి విడత సహకార ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకున్నామని, నేటి నుంచి జరగనున్న రెండో విడత సహకారఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని కిరణ్ అజాద్ తో ధీమా వ్యక్తం చేశారు. 


తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ వ్యవహారాలు, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలం తదితర అంశాలపై వారు చర్చించినట్లు  సమాచారం. గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకోవడం విశేషంగా కనిపిస్తుంది.