నాదగ్గర నీ కంటే పెద్ద బటన్ ఉంది.. జాగ్రత్త..

 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య మాటల యుద్దం రోజు రోజుకు పెరుగుతున్నసంగతి తెలిసిందే. ఉత్తరకొరియా అణుబాంబులు ప్రయోగించడం.. అమెరికా దానిని తప్పుబట్టడం గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న తంతే. ఈ నేపథ్యంలోనే... కిమ్ ట్రంప్ ను రెచ్చగొట్టడం.. ట్రంప్ కూడా కిమ్ కు తనదైన శైలిలో సమాధానం ఇవ్వడం... దాంతో ఈ రెండు దేశాలు మధ్య పెద్ద యుద్దమే జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి కిమ్.. ట్రంప్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన టేబుల్ పై ఓ బటన్ ఉన్నదని, దాన్ని నొక్కితే, అణుబాంబు బయలుదేరుతుందని హెచ్చరించాడు. ఇక దీనికి ట్రంప్ ఊరుకుంటాడా...తనదైన శైలిలో స్పందించాడు. "నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్, ఇప్పుడే తన టేబుల్ పై ఎల్లప్పుడూ అణు బాంబు బటన్ ఉంటుందని చెప్పారు... ఆయనకు ఎవరైనా హితవు చెప్పండి... నా దగ్గర కూడా ఓ న్యూక్లియర్ బటన్ ఉంటుంది... అది చాలా పెద్దది, మరింత శక్తిమంతమైనది... నా బటన్ కూడా పని చేస్తుంది" అని ఓ ట్వీట్ పెట్టారు. ఇక ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. మరి ట్రంప్ ట్వీట్ కు కిమ్ ఎలా రియాక్ట్ అవుతాడో.. వారిమధ్య మాటల యుద్దం ఎంత వరకూ వెళుతుందో చూద్దాం...