కిడ్నీట్రాన్స్ ప్లాంట్లలో భారత్ 2వ స్థానం..

కోవిడ్ మరణాల కన్నా కిడ్నీ మార్పిడి వల్ల 5 రెట్ల మరణాలు ఎక్కువని ఒక పరిశీలనలో వెల్లడి. కోవిడ్ మరణాల కన్నా కిడ్నీ మార్పిడి వల్ల 5 రెట్ల మరణాలు ఎక్కువగా  ఉన్నాయని సాదార ప్రజలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడించారు. ఈ పరిశీలన దేశంలోని 13 ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ లలో నిర్వహించినట్లు సమాచారం. పరిశీలన వివరాలను ట్రాన్స్ ప్లాంట్ జర్నల్ లో ప్రచురించేందుకు అనుమతించారు.  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్న 250మందిలో 226 మంది దాతలే ఉన్నారని అందులో 24 మంది కోవిడ్ వచ్చినవారే అని అన్నారు. మార్చి 23 నుండి సెప్టెంబర్ వరకు పరిశిలించినట్లు అందులో 29 మందికి కోవిడ్ సోకి మరణించారని పరిశీలకులు పేర్కొన్నారు. అహ్మదాబాద్ కు చెందిన హెచ్ ఎల్ త్రివేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సేవల విభాగానికి చెందినా వివేక్ కుటే మాట్లడుతూ కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య తక్కువే అని అన్నారు.

కోవిడ్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల కోవిడ్ వచ్చిందని దీనికన్న కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సమస్యలవల్ల చనిపోయినవారి సంఖ్య ఎక్కువే అని అన్నారు. వైద్యుల బృందం పరిశీలనలో 250 మంది కిడ్నీ తీసుకున్నవారు 94% మంది మోర్ బి డిట్రేస్, ఆర్ టే రియల్,హై పర్ టెన్షన్ సహజంగా వచ్చే సమస్యే అని అన్నారు. కాగా 84% మంది డయాబెటీస్ వల్ల మరణించి ఉండవచ్చని వివరించారు. 32% మంది ఇతర అనారోగ్య సమస్యలతో మరణించి ఉండవచ్చని ఢిల్లీ అపోలో ఆసుపత్రికి చెందిన ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ సందీప్ గుర్నియా, సర్ గంగారం ఆసుపత్రికి  నెఫ్రాలజీ విభాగానికి అధ్యక్షుడు డాక్టర్ ఎ కే బల్లా  నేతృత్వంలోని బృందం ఈ అంశాలను వెల్లడించింది. డాక్టర్ భల్లా పరిశీలనలో కోవిడ్ కన్నా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ వల్ల మరణించిన వారి సంఖ్య 4 రెట్లు 4 8-౩౩% మరణించారని ఇటీవల జరిపిన పరిశీలనలో వెల్లడి అయ్యిందని అన్నారు. అయితే గతంతో పోలిస్తే కిడ్నీదాతలు గణనీయంగా పెరిగారని భల్లా అన్నారు.

చాలా మంది ట్రాన్స్ ప్లాంట్  చేయించుకున్న వారు ఎక్కువగా ఎక్క్యుట్ కిడ్నీ ఇంజ్యురితో బాధపడడం గమనించామని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ఇదే సమాచారం అందిందని అన్నారు. ఆయా దేశాలలో 11 .6% మాత్రమే అని భారత్ లో  చాలా మంది యువకులు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారని డాక్టర్ భల్లా అన్నారు. అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ సందీప్ గుర్నియా మాట్లాడుతూ కోవిడ్ ఉన్నవారికి ట్రాన్స్ ప్లాంట్ జరిగిందా? కోవిడ్ పాసిటివ్ ఉన్నవారు డయాలాసిస్  చేయించుకున్నవారు ఉండి ఉండవచ్చని అంటున్నారు. ఈ విషయం డయాలసిస్  సెంటర్లలో  నిర్వహించిన పరిశీలనలో వెల్లడి అయ్యిందని అన్నారు. భారత్ లో 12% నుంచి 3 7% మంది ఉండి ఉండవచ్చని దీనిని బట్టి కోవిడ్ సమయంలో ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ లు చాలా యాక్టివ్ గా పనిచేసినట్లు తెలుస్తోందని డాక్టర్ గులేరియా అన్నారు.

సర్ గంగారాం ఇన్స్టిట్యుట్ ఆఫ్ రెనాల్ సైన్సెస్ చైర్మన్  మేనేజ్మెంట్ బోర్డుకు చెందిన డాక్టర్ డి . ఎస్ రాణా మాట్లాడుతూ 4 9, 1 5 5 వేల ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు నిర్వాహించినట్లు  చెప్పారు. 2013-2018  మద్య  కాలంలో 39,౦౦౦ మంది దాతలు వచ్చారని, వారిలో 2018 నాటికీ 10,155మంది సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ట్రాన్స్ ప్లాంట్లలో భారత్  2వ స్థానంలో ఉందని తెలిపారు. ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారికి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవల్సి ఉందని నొక్కి చెప్పారు. సమయానికి సరైన మందులు వాడడం అవసరమని అప్పుడే వారి ప్రాణాలు కాపాడగలమని అన్నారు. అసలు కిడ్నీ దాతలు ఎలా వచ్చారు?  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు ఎథిక్స్ కమిటీ అనుమతిన్చిందా?  దీని వల్ల వచ్చే పరిణామాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అన్న సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఎవరైనా దాతలు ముందుకు రావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి. అందుకు సవాలక్ష ఆంక్షలు, మరి ఇంత పెద్ద సంఖ్యలో దాతల సమీకరణ ఎలా చేసారు అన్నది సందేహం.? మామూలుగానే దాతలు దొరకడం కష్టం ఏళ్ల తరబడి ఎదురు చూసినా దొరకని దాత వీళ్ళకి మాత్రమే ఎలా దొరికారు? అసలు దీని వెనక ఉన్నది ఎవరు ? అన్న సందేహం ఉంది ? ఎవరు అనుమతించారు అన్నది మరో ప్రశ్న ?  ఇలా పుట్టుకొచ్చే ప్రశ్నలకు నిపుణులే చెప్పాలి.