Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్: ఇడ్లీ సాంబార్, రికార్డింగ్ డాన్సులు
posted on: Jun 21, 2014 3:13PM
.jpg)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సీమాంధ్రుల మీద కామెంట్లు చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది ఇడ్లీ సాంబార్, రికార్డింగ్ డాన్సులే అంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శనివారం ప్రొ.జయశంకర్ మూడో వర్థంతి. ఈ సందర్బంగా తెలంగాణ భవన్లోని ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్‌ని తెలంగాణ కోసం చేసిన కృషిని కొనియాడారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో లేకపోవడం మన దురదృష్టం అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీమాంధ్ర మీద పైన పేర్కొన్న వెటకారం కామెంట్లు చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన్పటికీ తన ప్రవర్తన ఎంతమాత్రం మారాలేదని ఆయన ఈ సందర్భంగా మరోసారి నిరూపించారు.


.jpg)



