టీఆర్ఎస్ వెనుక బీజేపీ... గమనిస్తున్న పార్టీలు...

 

దేశ రాజకీయాలు మునుపెన్నడూ లేనంత వేడి పుట్టిస్తున్నాయి. ఒకపక్క ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తుంటే..మరోపక్క టీఆర్ఎస్ నేతలు రిజర్వేషన్లపై.. ఇంకో రాష్ట్రం కావేరి నది వివాదంపై ఇలా పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. టీడీపీ నేతలు బీజేపీ నుండి బయటకు వచ్చి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ఇక దీని వెనుక చంద్రబాబు ఉన్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ చంద్రబాబుకి మద్దతుగా నిలిచాయి. కానీ దురదృష్టం ఏంటంటే.. అంతమంది మద్దతున్నా అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రాకపోవడం. కారణం టీఆర్ఎస్ పార్టీ.. అన్నాడీఎంకే పార్టీ.

 

టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తుంది. అన్నాడీఎంకే పార్టీ కావేరి జల వివాదం పై డిమాండ్ చేస్తుంది. ఈ రెండు పార్టీలు కనుక సెలైంట్ గా ఉంటే.. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుంది. కానీ అది జరగడం లేదు. ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని.. చెప్పిన టీఆర్ఎస్ ఇప్పుడు ఇలా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అన్నాడీఎంకే పార్టీ అంటే మోడీ డైరెక్షన్ లో నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ పార్టీ లోక్ సభలో ఆందోళన చేసే విషయంలో ఎవరికీ పెద్దగా అనుమానాలు లేవు. కానీ టీఆర్ఎస్ ను చూస్తుంటేనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ వెనుక బీజేపీ ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదో థర్డ్ ఫ్రంట్ పేరుతో హంగామా చేస్తున్నారు కానీ...  అయితే ఆచరణలో మాత్రం ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అనేక పార్టీల్లో ఉన్నాయి. అందుకే.. అవిశ్వాసం అంశం చర్చకు రాకుండా చేయడంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని మిగిలిన రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి. అందుకే... కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీలు ఒక వైపు తాము బీజేపీకి కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నామని చెబుతూనే బీజేపీని టార్గెట్ చేసే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడం ఏమిటని పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరి కేసీఆర్ ఇలానే వ్యవహరిస్తే థర్డ్ ఫ్రంట్ సంగతేమో కానీ... తమ పార్టీకే మద్దతి లేకుండా చేసుకునేలా ఉన్నాడు. మరి జనాల్ని పిచ్చోళ్లని చేయడం ఈజీ ఏమో కానీ... తోటి రాజకీయ పార్టీలను పిచ్చోళ్లని చేయడం ఈజీ కాదని కేసీఆర్ కు కూడా అర్దమయ్యే టైం దగ్గర్లోనే ఉంది.