ఫిక్సయిపోండి... కేటీఆర్ సీఎం!‌

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే లెవల్లో సూపర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో ఆయన చెప్పకుండానే చెప్పేశారు. ముసుగులో గుద్దులాట లేకుండా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి మరెవరో కాదు... కేటీఆర్. 2019 ఎన్నికల తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రిగా వుండరు. అంటే అర్థం అయన ఎన్నికలలో ఓడిపోతారు అని కాదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం కోసం ఢిల్లీకి వెళ్తారు... అదన్నమాట.  2019 ఎన్నికలలో తెరాస అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరు అవుతారు? ఇంకెవరూ కేటీఆరే. ఈ విషయాన్ని కెసిఆర్ చెప్పకనే చెప్పారు. అయన చెప్పిన దాని ప్రకారం 2019 లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఫుల్లుగా డెవలప్ చేస్తారు. ప్రధాని మోడీ ఎలాగైతే గుజరాత్ రాష్ట్రాన్ని డెవలప్ చేసి డిల్లీ వెళ్ళారో. అదే టైపులో కెసిఆర్ కూడా తెలంగాణాని 2019 లోపు డెవలప్ చేసేసి ఢిల్లీకి వెళ్లారుట. తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు ఇక్కడున్న సమర్థుడికి అప్పగిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో నాలుగైదు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి దూసుకు వెళ్తున్న కేటీఆర్ కి మించిన సమర్థుడు ఇంకెవరు వున్నారు చెప్పండి. కెసిఆర్ ఢిల్లీ వెళ్ళడం అంటే ఏంటి? ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించడం అని అర్థం చేసుకోవాలి. కెసిఆర్ ప్రధాని, కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి... అబ్బ.. చూడటానికి రెండు కళ్లూ చాలవు. 2019 సంవత్సరం త్వరగా వస్తే బాగుండు.