కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీగా స్వతంత్రులు

తెలంగాణ లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. తెరాస పార్టీని  గద్దె దింపాలనే లక్ష్యంతో ఇతర పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసారు. ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీ చేసే స్థానం నుంచి..

 

ప్రజా గాయకుడు గద్దర్‌, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం నుంచి విమలక్కను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నట్లు తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీమాస్‌ ఫోరం) ఛైర్మన్‌ కంచ ఐలయ్య తెలిపారు. ఇప్పటికే టీమాస్‌, బీఎల్‌ఎఫ్‌, సీపీఎంలు వీరిద్దరికి మద్దతు ప్రకటించాయన్నారు. కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ తదితర పార్టీలు వారి అభ్యర్థులను బరిలోకి దించకుండా చూడాలని కోరారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం అభ్యర్థులు స్పష్టం చేయలేదు.