కేసీఆర్ మోదీ ఏజెంట్ - ఉత్తమ్ 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న సభలో అప్పటివరకు బీజేపీపై దుమ్మెత్తి పోసి, అనంతరం మోదీని ఆలింగనం చేసుకోవటం అందరికి తెలిసిందే.దీనిపై ఆ పార్టీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ద్వేషాన్నివ్యతిరేకిస్తుందని అందుకే "మీరు ద్వేషించినా.. మేము ప్రేమిస్తున్నామన్న" సందేశం తెలియజెప్పటానికే కౌగిలించుకున్నారని తెలిపారు.

 

నిన్న లోక్‌సభలో తెరాస అనుసరించిన వ్యవహార శైలిని అందరూ గమనించారన్న ఉత్తమ్‌, కేసీఆర్‌ మోదీ ఏజెంట్‌ అని, నిన్నలోక్‌ సభలో తెరాస, భాజాపా దోస్తీ  బయటపడిందని అన్నారు. అసెంబ్లీలో మోదీని విమర్శించొద్దని చెప్పిన వ్యక్తి కేసీఆరే అని గుర్తుచేశారు. ముస్లిం రిజర్వేషన్లపై తెరాస లోక్‌సభలో ఎందుకు నిలదీయాలేదన్నారు. ముస్లింల పట్ల ప్రేమ నటించే కేసీఆర్‌.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఎందుకు పాల్గొనలేదని అడిగారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు అడగకుండా, నాలుగేళ్ల తర్వాత అడగడమేంటని నిలదీశారు.