వైసీపీకే షాకిచ్చిన కత్తి... వైసీపీ ఆగ్రహం....

 

కత్తి మహేశ్.. కత్తి మహేశ్.. కత్తి మహేశ్.. ఓరి దేవుడా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పేరే వినిపిస్తోంది.. ఏ టీవీ ఛానల్ పెట్టినా ఈయనే కనిపిస్తున్నాడు. ప్రధాని మోడీ దగ్గర నుండి.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ కూడా ఇంతలా కవరేజ్ ఇవ్వలేదేమో మీడియా వాళ్లు. అంతలా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు కత్తి మహేశ్ ఇప్పుడు. ఏదో సినిమా క్రిటిక్స్ చెప్పుకుంటూ ఉండే ఈయన.. బిగ్ బాస్ షో కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అందరికీ పరిచయం. ఆతరువాత ఇక ఎప్పుడైతే పవన్ పై విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కాడో... ఆరోజు నుండి ఈరోజు వరకూ ఆయన ఏదో ఒక ఛానల్ లో కనిపిస్తూనే ఉన్నారు. గత నాలుగు నెలల నుండి ఈ వివాదం నడుస్తూనే ఉంది.

 

మరోవైపు కత్తి మహేశ్ చేస్తున్న విమర్శలకు పవన్ అభిమానులు ఎలాగూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా వాళ్లపై కూడా సీరియస్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక్క పవన్ అభిమానులే కాదు.. సామాన్య ప్రజలు కూడా మీడియాపై, కత్తి మహేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాకు ఇదొక్కటే న్యూసా... ఇంకేం లేవా దేశంలో.. రాష్ట్రంలో సమస్యలు అంటూ మండిపడుతున్నారు. అందరి సంగతేమో కానీ ఇప్పుడు వైసీపీ కూడా కత్తి మహేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. విచిత్రంగా ఉంది కదా...

 

ఎందుకంటే.. అసలు వైసీపీ వదిలిన బాణమే కత్తి మహేశ్ అని అందరి టాక్. కత్తి మహేశ్ పవన్ పై అంతలా రెచ్చిపోవడానికి కారణం వైసీపీనే అని.. వైసీపీనే కత్తి మహేశ్ ను నడిపిస్తుందని అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అలాంటిది కత్తి మహేశ్ పై వైసీపీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసిందబ్బా అనుకుంటున్నారా..? జగన్ ప్రజాసంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా... అయితే ఛానెల్స్ మొత్తం కత్తి మహేష్ వెంట పడుతున్నాయి తప్పా... జగన్ చేస్తున్న పాదయాత్ర గురించి పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. అందుకే మెల్లమెల్లగా కత్తి మహేష్ వల్ల జగన్ కి జరుగుతున్న డామేజ్ వైసీపీకి అర్ధం అవుతోంది. దీంతో కత్తి మహేశ్ అంటే కోప్పడుతున్నారట. మొత్తానికి.. వారు విసిరిన బాణం....వారికే వచ్చి తగిలింది పాపం..