అల్లు అరవింద్ కే కత్తి వార్నింగ్..

 

పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిఒక్క మాటకు కౌంటర్ ఇస్తు.. గత కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తున్న కత్తి మహేశ్ ఈసారి ఏకంగా అల్లు అరవింద్ కే వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంతకీ ఏ విషయంలో అల్లు అరవింద్ కి కత్తి ఫైర్ అయ్యాడనుకుంటున్నారా..? అదేంటంటే.... సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లు అన్నీ కూడా అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచే వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తన ఫొటోలను వాడుతూ, పందులతో పోలుస్తూ నీచమైన కామెంట్లు చేస్తున్నారని ఫేస్ బుక్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫొన్ నంబర్ కూడా మెగా ఫ్యాన్స్ కు చేరిపోయిందని.... అది కూడా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచే జరిగిందని అన్నాడు. అంతేకాదు... ఇలాంటివాటిని ఆపాలని.. వీటిపై అల్లు అరవింద్ చర్యలు తీసుకోకపోతే... తాను యాక్షన్ లోకి దిగాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు. మరి దీనిపై అల్లు అరవింద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.