కర్ణాటక ఎన్నిక్లలు.. ముగిసిన ఎన్నికల ప్రచారం..


రెండు రోజుల్లో కర్ణాటక ఎన్నిక్లలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. నేటితో ప్రచారానికి గడువు ముగియడంతో...ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కాగా, ఈ నెల 12న కర్ణాటకలోని 223 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఇదిలా ఉండగా, కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలుండగా, బీజేపీ అభ్యర్థి విజయకుమార్ ఆకస్మిక మరణంతో జయనగర నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడింది.