కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు విడుదల....

కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి కర్ణాటక పైనే ఉంది. నేతలు టేన్షన్ తట్టుకోలేకపోతున్నారు. యడియూరప్ప ధర్మస్థలంలోని మంజునాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అటు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ షిరిడీ వెళ్లారు. సాయినాథుని దర్శించుకున్నారు. ఈ నెల 5 న 15 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల పై న్యాయ స్థానాల్లో కేసులు ఉండడంతో ఆ రెండు నియోజక వర్గాలకు ఎన్నికలు జరగలేదు.

దీంతో అసెంబ్లీలో మిగిలిన 222 గానో మాజిక్ నెంబర్ 12 ప్రస్తుతం బీజేపీకి 105 ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్ తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకే మద్దతిస్తున్నారు. ఇవాళ వెల్లడై ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం 6 ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజారిటీ ఉంటుంది. లేదంటే యడ్యూరప్ప సర్కార్ మైనార్టీల పడబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 26, జేడీఎస్ కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు. 14 మంది కాంగ్రెస్, 3 జేడీయస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్ జేడీఎస్ సర్కార్ కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసినా సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.ఈ ఫలితాలపై సర్వత్ర ఆశక్తి నెలకొన్నది.