మరో బాంబు పేల్చిన మిశ్రా...


ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ లంచం తీసుకున్నారంటూ అవినీతి ఆరోపణ చేసిన ఆప్ బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా ఇప్పుడు తాజాగా మరో బాంబ్ పేల్చారు. కేజ్రీవాల్ కు రూ.2కోట్లు ఇచ్చారని మిశ్రా ఆరోపించగా... దానిపై స్పందించిన పారిశ్రామిక వేత్త శర్మ 'అవును! కేజ్రీవాల్ కు 2 కోట్లు ఇచ్చాను...అది పార్టీకి విరాళంగా ఇచ్చాను...ఈవిషయం ఆప్ పార్టీ నేతలందరికీ తెలుసు అని ఆయన అన్నారు.

 

దీనిపై స్పందించిన మిశ్రా ‘ముఖేశ్‌కుమార్‌ అలియాస్ ముఖేష్ శర్మ దగ్గర నుంచి ఆప్‌కు డబ్బులు వచ్చాయి. ముఖేశ్‌ కంపెనీ ఓ బ్యాంకుకు రుణం ఎగవేసింది. అలాంటపుడు ఆ కంపెనీ నుంచి ఆప్‌కు రూ.2కోట్లు ఎలా వచ్చాయి? అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న హేమ్‌ప్రకాశ్‌ శర్మ గుర్తింపును కప్పిపుచ్చేందుకు ముఖేశ్‌ను అడ్డం పెట్టుకున్నారు. అంతేకాదు తనకు హవాలాదారుల నుంచి ఆప్‌కు భారీగా నిధులు వచ్చాయని మిశ్రా ఆరోపించారు. హవాలా ఆపరేటర్ల దగ్గర నుంచి పార్టీకి నిధులు వచ్చాయి. ఏయే ఏయే కంపెనీల నుంచి నిధులు వచ్చాయని చెబుతూ ఆ కంపెనీల లెటర్‌హెడ్స్‌ను ఆధారాలుగా చూపుతున్నారో అవి నకిలీవి. ఆప్‌ వాటిని ఫోర్జరీ చేసింది’ అని మిశ్రా ఆరోపించారు.