చంద్రబాబు నా హీరో...


తమిళనాడు విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరోసారి కమల్ చంద్రబాబును ప్రశంసించారు. కమల్ హాసన్ ఈరోజు తన రాజకీయ యాత్రను ప్రారంభించి.. పూర్తి రాజకీయాల్లోకి వచ్చేశారు. రామేశ్వరంలోని అబ్దుల్ కలామ్ స్వగృహం నుంచి ఆయన రాజకీయ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నిన్న రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ప్రజలకు సేవ చేసే విధానంపై సలహాలు, సూచనలు ఇచ్చారు" అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు తన హీరో అని వ్యాఖ్యానించారు. అంతేకాదు... సినిమాలకు, రాజకీయాలకూ తేడా ఉందని తాను భావించడం లేదని, రెండు రంగాలూ ప్రజల కోసమేనని వ్యాఖ్యానించిన ఆయన, రాజకీయాల్లో బాధ్యత కాస్తంత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.