మరోసారి చంద్రబాబుపై కమల్ కీలక వ్యాఖ్యలు...

 

తమిళనాడు విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజుల క్రితం టైమ్స్ లిట్‌ఫెస్ట్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, "ఐ యాం ఏ ఫ్యాన్ అఫ్ చంద్రబాబు నాయుడు" అని వ్యాఖ్యానించారు. అంతేకాదు... ఆంధ్రప్రదేశ్ కోసం పడిన కష్టం, ఇప్పుడు నవ్యాంధ్ర కోసం పడుతున్న కష్టం గురించి చెప్తూ, ఆ వ్యాఖ్యలు చేసారు. మళ్ళీ ఇప్పుడు కమల్ హాసన్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక తమిళ మ్యాగజైన్ లో రాసిన ఎడిటోరియల్ లో చంద్రబాబుతో పేరు ప్రస్తావిస్తూ, ఆర్టికల్ రాసారు.

 

ద్రవిడ గుర్తింపు కింద దక్షిణ భారతదేశం ఏకమై సమష్టి వాణి వినిపిస్తే అది కేంద్ర ప్రభుత్వాన్ని దారిలోకి తీసుకురావడానికి సరిపోతుందని... చంద్రబాబుతో పాటు, మిగతా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు ప్రస్తావిస్తూ, వీరందరూ ద్రవిడులే... దక్షిణ భారత దేశమంతటా ద్రవిడ గుర్తింపు విస్తరించిన పక్షంలో మన పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష అదృశ్యమైపోతుంది. మనమంతా ఏకమై సమష్టి గొంతు వినిపిస్తే అది మనలను ఢిల్లీతోమాట్లాడటానికి అనుమతిస్తుంది అని కమల్ హాసన్ అన్నారు.