కమల్ హాసన్ కు తెలిసొచ్చిందా...?


కాలు జారితే తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే తీసుకోలేమని పెద్దలు ఊరికే చెప్పలేదు. తొందరపడి అందుకే ఏం మాట్లాడకూడదు. ముఖ్యంగా సెలబ్రిటీలు.  ఇప్పుడు అలా మాట్లాడే ఇరుకున పడ్డాడు విలక్షణ నటుడు కమల్ హాసన్.. రాజకీయాల్లోకి వస్తా అని చెప్పి.. ఇంకా పార్టీ పెట్టింది లేదు.. ఏం లేదు... అప్పుడే  హిందూ ఉగ్రవాదం అని.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ ఉగ్రవాదం బాగా పెరిగిపోయిందని కమల్ హాసన్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఏమైంది... అనుకున్నదే జరిగింది. హిందుత్వ సంస్థలు కమల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ కాల్చి పారేయాలని... ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన కమల్.. ఒక కీలక అంశంపై ప్రశ్నిస్తే జాతి వ్యతిరేకు లంటున్నారని, ప్రశ్నించడమే నేరమైనట్టు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.  దేశంలోని జైళ్ళు ఖాళీగా లేవని, అందుకే కాల్చి చంపుతామనో, ఉరి తీయాలనో డిమాండ్ చేస్తున్నారని ఎటకారంగా  మాట్లాడాడు. ఇప్పుడు ఏమైందో ఏమో నేను అలా అనలేదని మాటమార్చాడు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... తాను ఉగ్ర‌వాదులు అన్న ప‌దాన్నే అస్స‌లు వాడ‌లేద‌ని.. తాను అతివాదులు, తీవ్ర‌వాదులు అనే ప‌దాల‌ను మాత్ర‌మే వాడాన‌ని చెప్పుకొచ్చారు. హిందువుల మ‌నో భావాల‌ను కించ‌ప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేద‌ని.. తాను కూడా హిందూ కుటుంబానికి చెందినవాడినేన‌ని అన్నారు. మరి కమల్ సడెన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడో. పాపం తెలుసొచ్చినట్టు ఉంది.. నోరు కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడాలని...