కమల్ హాసన్ కు కోర్టు సమన్లు...


ప్రముఖ నటుడు కమలహాసన్ కు సమన్లు అందాయి. చెన్నైలోని వల్లియూర్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. మహాభారత గ్రంథం, ద్రౌపదిపై ఇటీవల కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కమల్ చేసిన వ్యాఖ్యలకు గాను.. కమల్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ హిందూ మక్కల్ కట్చి పార్టీ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలోనే కమల్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.