తప్పు తెలుసుకున్న కమల్...

 

తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని కమల్ హాసన్ ప్రకటించారో లేదో అప్పుడే రాజకీయ నేతల లక్షణాలు వచ్చేసినట్టు ఉన్నాయి. అప్పుడే వాళ్లు మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నారు. ఇంతకీ కమల్ హాసన్ ఏం మాట్లాడారనుకుంటున్నారా..? నల్లధనాన్ని అరికట్టే నేపథ్యంలో మోడీ పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు నోట్ల రద్దను సమర్థిస్తూ.. మోదీకి సెల్యూట్..అన్ని రాజకీయ పార్టీలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అంటూ కమల్  ట్వీట్ చేశాడు. ఇప్పుడు దానిపై స్పందించిన కమల్ ఇప్పుడు తప్పయింది.. క్షమించండి అని అంటున్నాడు. మోదీ కూడా తన తప్పును తెలుసుకుంటే.. ఆయనకు కూడా సెల్యూట్ చేస్తానని అన్నాడు. అంతేకాదు చేసిన తప్పును అంగీకరించడం, దానిని సరిదిద్దుకోవడం ఓ రాజ నీతిజ్ఞుడి లక్షణమని అతను అన్నాడు. అయితే రెండు నెలల కిందటే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్.. కచ్చితంగా బీజేపీలో మాత్రం చేరను అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోట్ల రద్దును సమర్థించడం తప్పే అని అంగీకరించడం గమనార్హం.