కాళేశ్వరం ప్రారంభం.. ఏపీ సీఎంకు అరుదైన గౌరవం!!

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవిస్‌, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు విచ్చేశారు. సరిగ్గా 11: 25 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ కేసీఆర్ ప్రారంభించించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కన్నెపల్లి పంపుహౌ‌స్‌లో ఆరో నంబరు మోటార్‌ను కేసీఆర్‌ స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభించనున్నారు. అనంతరం డిస్ర్టిబ్యూటరీ సిస్టం వద్దకు వెళ్లి గ్రావిటీ కెనాల్‌ ద్వారా అన్నారం బ్యారేజీకి గోదావరి జలాలు వెళ్లడాన్ని పరిశీలిస్తారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని స్విచ్‌ ఆన్ చేసి ఆవిష్కరించారు. సరిగ్గా 11:23 నిమిషాలకు ఈ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కాగా.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, గవర్నర్ నరసింహన్ ఇద్దరూ ఉన్నప్పటికీ వైఎస్ జగన్‌కు ఈ అవకాశం కల్పించడం విశేషమని చెప్పుకోవచ్చు.