తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్..!!

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది.. ఇప్పటికే తెరాస 105 అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించింది.. మరోవైపు విపక్షాలు కూడా ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెరాసను ఓడించడమే లక్ష్యంగా ఇతర పార్టీలను కలుపుకొని పోవాలని చూస్తోంది.. ఇప్పటికే కాంగ్రెస్- టీడీపీ పొత్తు గురించి వీపరితమైన చర్చలు జరుగుతున్నాయి.. త్వరలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈ పొత్తులో భాగంగా టీడీపీ 15 నుంచి 20 స్థానాల మధ్యలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

అయితే ఇప్పుడొక ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది.. అదే టీడీపీ తరుపున తెలంగాణలో ప్రచారం చేసే స్టార్ కాంపైనర్ ఎవరు?.. ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉందికానీ పూర్తి స్థాయి ప్రచార బాధ్యతలు చేపట్టే సమయం ఉండదు.. దీంతో తెలంగాణ ప్రచార బాధ్యతలు లోకేష్ కి అప్పగించాలని చూస్తున్నారట.. మరోవైపు కొందరు నేతలు ఎన్టీఆర్ పేరు కూడా తెరమీదకు తీసుకొస్తున్నారట.. గతంలో ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభించింది.. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ చేత తెలంగాణలోని కొన్ని స్థానాల్లో ప్రచారం చేపిస్తే బాగుంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట.. అసలే తండ్రి మరణంతో బాధలో ఉన్న ఎన్టీఆర్ ని ప్రచారం చేయమని చంద్రబాబు అడుగుతారా?.. రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాల దృష్టి పెడుతున్న ఎన్టీఆర్ ఇలాంటి సమయంలో ప్రచారం చేయడానికి అంగీకరిస్తారా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.