కాంగ్రెస్ కి బిగ్ షాక్.. జీవన్‌రెడ్డి ఓటమి

 

తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి. కాంగ్రెస్ కి ఇప్పటికే ఒక బిగ్ షాక్ కూడా తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి జగిత్యాలతో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాలకు గాను 12 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ జగిత్యాలలో మాత్రం జీవన్‌రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంజయ్‌కుమార్‌ ఈ సారి ఆయనపై విజయం సాధించారు. దీంతో జీవన్‌రెడ్డి విజయాల పరంపరకు బ్రేక్‌ పడింది. జీవన్‌రెడ్డి బాటలో మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు క్యూ కట్టే అవకాశముంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.