అమ్మ జగన్ ఇంత స్టోరీ నడిపావా...!

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుట్టు బయటపెట్టారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం. కావాలని అన్నారో... లేక ఫ్లోలో వచ్చిందో తెలియదు కానీ... నిజాన్ని మాత్రం బయటపెట్టాడు. జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి..కొత్త పార్టీ ఎప్పుడైతే పెట్టాడో.. వెంటనే అవినీతి కేసులో ఇరుక్కున్నాడు. జగన్ కాంగ్రెస్ పార్టీ వీడినందుకే కాంగ్రెస్ పార్టీ జగన్ పై ఉన్న అవినీతి కేసును బయటకుతీసిందన్న వార్తలు కూడా వచ్చాయి ఇక ఈ కేసులో పాపం జగన్ ఏకంగా 16 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. ఇక ఈ కేసులో జగన్ కు బెయిల్ ఎలా వచ్చిందనే విషయాన్ని జేడీ శీలం బయటపెట్టారు.

 

తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ మధ్య 2014 ముందు జరిగిన చీకటి ఒప్పందం గురించి బయట పెట్టారు. జగన్ జైలులో ఉన్న సమయంలో సోనియా గాంధీ వద్దకు ఒక దూతను పంపి, తనకు బెయిలు వచ్చేందుకు సహకరిస్తే రాష్ట్ర విభజనకు అడ్డు పడను అని హామీ ఇచ్చారట. దీనితో ఆయనకు సోనియా కనికరించడం, జగన్ కు బెయిలు రావడం జరిగిపోయిందట. 16 నెలల జైలు జీవితం తరువాత ఆయన బయటకు వచ్చారు. అందుకే సోనియాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా పోరాటంలో ఏదో నామ్ కే వాస్త్ విభజనకు వ్యతిరేకం అన్నట్టు కలరింగ్ ఇచ్చారు. చీకట్లో చేయాల్సింది చేసి మళ్లీ ఏం తెలియనట్టు అమాయకపు మొహాలు పెట్టడం. ఇంకేముంది ఈ మాటలు కాస్త టీడీపీ చెవిన పడ్డాయి. అంతే..జేడీ మాటలు ఉన్న వీడియో తీసి చిన్న వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చి పడిందంటే చాలు.. దాదాపు అందరికీ రీచ్ అయిపోనట్టే. దీంతో ఏపీ విభజనలో జగన్ హ్యాండ్ కూడా ఉన్నట్టు అందరికి తెలిసిపోయింది. అసలే జగన్ పై జనాల్లో వ్యతిరేకత ఉంది.. ఇప్పుడు ఇలాంటి నిజాలు బయటపడితే సీఎం పదవి సంగతేమో... ముందు పార్టీ పరువు పోకుండా చూసుకోవాలి...