జగన్ అక్రమాస్తుల కేసుపై లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..

 

జగన్ అక్రమాస్తుల కేసుపై మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నఆయన  జగన్ కేసుల ప్రస్తావనకు రాగా..  తనకు జగన్ కేసులను విచారించిన అధికారిగా పేరు వచ్చినప్పటికీ, తాను ఆ ఇమేజ్ ని కోరుకోవడం లేదని చెప్పారు. తనకు జగన్ కేసులను విచారించిన అధికారిగా పేరు వచ్చినప్పటికీ, తాను ఆ ఇమేజ్ ని కోరుకోవడం లేదని... నాడు తనకు అప్పగించిన డ్యూటీని తాను చేశానని, ఆనాడు తనపై ఏ విధమైన రాజకీయ ఒత్తిడులూ లేవని..  ఆ కేసును తనకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, హైకోర్టు బెంచ్ నిర్ణయించి విచారించాలని అప్పగించిందని, ఎవరూ డైరెక్టుగా ఇచ్చిన కంప్లయింట్ కాదని గుర్తు చేశారు.

 

కేసులో అందుబాటులోని సాక్ష్యాధారాల ప్రకారం తాను డ్యూటీ చేశానని, తాను ఎంతో మంది అధికారులను పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టానని, క్షేత్రస్థాయిలో ఎంతోమంది అధికారులు జగన్ కేసులపై దర్యాఫ్తు చేశారని.. తాను ఆ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత, ఎంతో మంది అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని అన్నారు. దీనికి గాను జగన్ కేసు బలహీనపడి, వీగిపోతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వార్తలపై స్పందించిన ఆయన ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేనని, ఇప్పుడున్న అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనుకుంటున్నానని తెలిపారు.